విరాసత్ చేయాలని రైతు ఆత్మహత్యాయత్నం..

by Kalyani |
విరాసత్ చేయాలని రైతు ఆత్మహత్యాయత్నం..
X

దిశ, మద్దూరు: వారసత్వంగా వచ్చిన భూమి వీరాసత్ చేయడంలో అధికారులు అలసత్వం చేస్తున్నారని నిరసిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గురువారం మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మండలంలోని రేని వాట్ల గ్రామానికి చెందిన మాల గోవిందు తన తండ్రికి చెందిన భూమి, వారసత్వంగా రావాల్సిన భూమి సర్వే నంబర్ 787 లో రెండు ఎకరాలు తన తల్లి పేరుపై చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.

అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. ఈ విషయమై విరాసత్ చేయుటలో అలసత్వం చేస్తున్నందుకు పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయమై గ్రామస్తులతో వివరాలు సేకరించి తహసీల్దార్ బాధితులకు విరాసాత్ చేసి పాసుపుస్తకాలు అందించారు.

Advertisement

Next Story