- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యారంగ అభివృద్ధే నా ధ్యేయం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
దిశ, నారాయణపేట ప్రతినిధి : విద్యారంగ అభివృద్దే తన ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు. స్థానిక అంజనా గార్డెన్స్ లో ఎస్ ఆర్ రెడ్డి యువ ఉద్యోగ యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నారాయణపేట నియోజకవర్గంలో విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ యాప్ ను తీసుకరావడం జరిగిందని, విద్యార్థులు నిరుద్యోగులు ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామస్థాయి నుంచి వచ్చిన విద్యార్థులలో నైపుణ్యత ఎక్కువ ఉంటుందని సరైన మార్గంలో విద్యార్థులు విద్యను అభ్యసించి.. తల్లిదండ్రులకు, చదివిన కళాశాలలకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మోసటి జ్యోతి, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ రంగారెడ్డి, రామకృష్ణ రెడ్డి, పద్మమ్మ ప్రతాపరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.