భ్రూణ హత్య పై విచారణ చేపట్టిన డిఎంహెచ్ఓ కృష్ణ

by Disha Web Desk 11 |
భ్రూణ హత్య పై విచారణ చేపట్టిన డిఎంహెచ్ఓ కృష్ణ
X

దిశ, మిడ్జిల్ : లింగ నిర్ధారణ చేసి అబార్షన్ చేయడం వల్ల మహిళ మృతి చెందడాన్ని జిల్లా వైద్యాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ కృష్ణ సోమవారం మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మృతురాలి కుటుంబ సభ్యులను అడిగి స్వీకరించారు. లింగ నిర్ధారణ జరిగిన స్కానింగ్ సెంటర్ వివరాలు, అబార్షన్ చేయించడానికి మహబూబ్నగర్ కు పంపించిన మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రజా వైద్యశాల పేరుతో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్ రమేష్ ఎంబీఎస్ ఉస్మానియా డాక్టర్ పాత్ర పై విచారణ చేపట్టారు.

వీరికి లింగ నిర్ధారణ చేపట్టి వి కేర్ ఆస్పత్రి లో అబార్షన్ చేయించడానికి మధ్యవర్తిగా వ్యవహరించిన రామకృష్ణ వివరాలు, అబార్షన్ చేసిన వి కేర్ ఆస్పత్రి వివరాలు, అబార్షన్ చేసిన వరలక్ష్మి అనే వృద్ధురాలి వివరాలను సేకరించారు. కాగా కుటుంబ సభ్యులు భయంతో పూర్తి వివరాలు వెల్లడించడం లేదని మరింత లోతుగా విచారించి ఈ ఘటనలో పాల్గొన్న దోషులందరిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని తెలిపారు. ఇలాంటి ఘటనలను ప్రేరేపించిన, ప్రోత్సహించిన, సూచించిన చట్ట ప్రకారం వారి పట్ల కఠినంగా శిక్షిస్తామని జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ కృష్ణ తెలిపారు. ఆయన వెంట డి ఈ ఎం ఓ డాక్టర్ తిరుపతిరావు, మండల వైద్యాధికారి డాక్టర్ శివకాంత్, సి హెచ్ ఓ రాము హెల్త్ అసిస్టెంట్ దేవయ్య, జంగయ్య ఏఎన్ఎం నీలమ్మ అంగన్వాడి టీచర్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed