- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి: పగిడాల శ్రీనివాస్
దిశ, వీపనగండ్ల: తెలుగుదేశం హయాంలోనే గ్రామాలు అన్నీ రంగాలలో అభివృద్ధి చెందాయని టీడీపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ పగిడాల శ్రీనివాస్ అన్నారు. శనివారం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కాల్వరాల గ్రామంలో పర్యటించి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రజా రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను ప్రవేశపెట్టారని అట్టి పథకాలే నేటికీ పునాదులుగా మిగిలాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలంలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే గోపాల్ దిన్నే రిజర్వాయర్ కు తెలుగుదేశం పాలనలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ నాయుడు, డాక్టర్ సాయి ధీరజ్, గోపాలకృష్ణ, రామస్వామి, హోటల్ వెంకటేష్, చందన్ గౌడ్, జగదీష్ గౌడ్, అజయ్ కుమార్ యాదవ్, చక్రి తదితరులు పాల్గొన్నారు.