పాలమూరు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 11 |
పాలమూరు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంగళవారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ మల్లురవిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని ప్రజలకు సూచించారు. మాదిగలను ఎబిసిడి వర్గీకరణ అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని సూచించారు. అంతేకాకుండా ముదిరాజులను బిసి-డి నుంచి ఏకు మారుస్తామని, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని అన్నారు. అంతేకాకుండా జోగులాంబ సాక్షిగా ఒట్టేసిచెబుతున్నా ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని సభ ను ఉద్దేశించి మాట్లాడారు.

హరీష్ రావు మాట్లాడుతూ… ఆగస్టు లోపు రైతుల రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని అన్నారని, నేను పూర్తి చేస్తే మీ మామ బీఆర్ఎస్ దుకాణం బందు చేయాలని, దానికి మీరు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. మాయ మాటలు చెబుతున్న బీజేపీ, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని ప్రజలకు సూచించారు. పదేళ్ల కాలంలో సంగం బండ ప్రాజెక్టు బండను పగలగొట్టడానికి పదేళ్లు పట్టిందని, నేను వచ్చిన తర్వాత 25 లక్షల తో బండ పగలగొట్టానని తరవాత తుమ్మెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి రైతంగానికి నీళ్లు ఇస్తానని అన్నారు. దేశంలో జీఎస్టీ ని తెచ్చి పెట్రోల్ డీజిల్ పై జీఎస్టీ విధించి ఆర్థిక వనరులు సమర్ధించుకున్న బిజెపి పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన సాగిందని, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అక్రమ కేసులతో బెదిరింపులతో కాలం వెళ్లబుచ్చారని , రైతులకు, ప్రజలకు పదేళ్ల కాలంలో ఏమీ ఒరగబెట్టింది లేదని అన్నారు.

మొన్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూర్చుని ఖాళీ చేయించి దుకాణం బంద్ చేయించింది ప్రజలకే దక్కిందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు బలిదానాల వల్ల స్వరాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందే కానీ ఏం ఓరగపెట్టింది ఏం లేదని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కు పబ్లిక్ కమిషన్ చైర్మన్ గా ఇస్తానని, తానే పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తే రాకుండా బీఆర్ఎస్ సంకెళ్లలో ఉన్నారని అన్నారు. ఈ జిల్లాలో నాకు ఎవరు శత్రువులు లేరు నా జిల్లాను అభివృద్ధి చేయడమే నాకు లక్ష్యం అని అన్నారు. త్వరలోనే ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

ఈ సభలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరాం, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ఎమ్మెల్సీ కుచకుళ్ళ దామోదర్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుచకుళ్ళ రాజేష్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, కాంగ్రెస్ నాయకులు ఇందిరా మాజీ జడ్పీటీసీ, కొండ మన్నెమ్మ నగేష్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కోడిదల రాము, కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి అమృత్ రెడ్డి, మండల అధ్యక్షులు మిద్దె రాములు, రాగి మధుసూదన్ రెడ్డి ,వట్టెం రామకృష్ణ, ఈశ్వర్ గంగనముని, మైనార్టీటి నాయకులు నసీర్,​ తిరుపతయ్య తో పాటు పలువురు ఉన్నారు.



Next Story

Most Viewed