Additional Collector :సంపూర్ణత అభియాన్ లక్ష్య సాధన వంద శాతం పూర్తి చేయాలి

by Kalyani |
Additional Collector :సంపూర్ణత అభియాన్ లక్ష్య సాధన వంద శాతం పూర్తి చేయాలి
X

దిశ, గద్వాల్ కలెక్టరేట్ : నీతి ఆయోగ్ - ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద ఎంపికైన గట్టు మండలంను సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."సంపూర్ణత అభియాన్ కార్యక్రమం"లో భాగంగా వైద్య శాఖలో ఉన్న మూడు సూచికలు ఎ ఎన్ సి రిజస్ట్రేషన్ , డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంద శాతం స్క్రీనింగ్ ను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సూపర్ వైజర్లు, ఎం ఎల్ హెచ్ పి, ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్లకు ఆదేశించారు. ఇంచార్జ్ డి ఏం హెచ్ ఓ సిద్ధప్ప మాట్లాడుతూ నీతి అయోగ్ వారు ఇచ్చిన ఇండికేటర్ లను వంద శాతం లక్ష్య సాధన చేయుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డి ఏం హెచ్ ఓ. సిద్ధప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజు, మాధవి, శ్యామ్ సుందర్, నీటి అయోగ్ కో-ఆర్డినేటర్ అఫ్జల్, గట్టు మందల సూపర్ వైజర్, ఏం ఎల్ హెచ్ పి లు, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.



Next Story