లక్కీ‌డిప్‌లో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : డీకే అరుణ

by Disha Web Desk 23 |
లక్కీ‌డిప్‌లో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : డీకే అరుణ
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీలో లక్కీ డిప్ తీస్తే అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి పేరు తగిలిందని,ఆయన నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.స్థానిక పద్మావతి కాలనీలోని కాళికాంబ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసంగించారు. సీఎం మాట్లాడే భాష ఆక్షేపనీయంగా,ఏవగింపు గా ఉంటుందని,తాను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాననే సోయి కూడా లేకుండా మాట్లాడుతున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు.ఒక మహిళను ఎలా గౌరవించాలో తెలియని వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటని ఆమె ఆరోపించారు.

సీనియర్ సిటిజన్ల సమస్యల పట్ల పార్లమెంట్ లో గళం విప్పుతానని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.వయో వృద్ధులు,మేధావులు,అనుభవజ్ఞులైన తామంతా పాలమూరు అభివృద్ధి కోసం కమలం పువ్వు గుర్తు పై ఓటేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.అంతకుముందు సీనియర్ సిటిజన్ ల సమస్యలపై పలువురు వక్తలు ప్రసంగించారు.రైల్వేలో టికెట్ పై ఉన్న 50 శాతం రాయితీలను పునరుద్ధరించాలని,ఆదాయపు పన్ను రాయితీ 5 లక్షలకు పెంచాలని,2004 లో తెచ్చిన సీపీఎస్ ను ఎత్తి వేయాలని,సీనియర్ సిటిజన్ల బ్యాంకు డిపాజిట్లపై వడ్డీని పెంచాలనే తదితర అనేక సమస్యలను ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి,పద్మజారెడ్డి,బురుజు రాజేందర్ రెడ్డి,తదితర విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed