- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాత డిజైన్ ప్రకారమే కాల్వ నిర్మించండి : కలెక్టర్ కు రైతుల వేడుకోలు
దిశ, నాగర్ కర్నూల్ : మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్, ఫుల్జాల, హాజిపూర్ కాల్వలను పాత డిజైన్ ప్రకారమే నిర్మించాలని రైతులు కలెక్టర్ ఉదయ్ కుమార్ కు మొరపెట్టుకున్నారు. బుధవారం ఆ ప్రాంత రైతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించారు. ప్రజావాణి హాల్లో ప్యాకేజ్-30 పరిధిలో భూములు కోల్పోతున్న ఫుల్జాల, హాజిపూర్రై తుల సమస్యలు, అభ్యంతరాలు, సూచనలను ఆర్డీవో ద్వారా మినిట్స్ రికార్డ్ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల అభ్యంతరాలను ప్రభుత్వానికి పంపి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతుల అభ్యంతరాలు, సూచనలను పేర్లతో సహా రికార్డు చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. రైతుల అభిప్రాయం మేరకు కాల్వను సర్వే చేయించి, నివేదికను ప్రభుత్వానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూసేకరణలో భూములు కోల్పోయిన దానికంటే రైతులకు అధిక ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. భూ పరిహారం విషయంలో ఆప్రాంతంలో అప్పటి వరకు జరిగిన కొనుగోలు, అమ్మకాల రేట్లను రాతపూర్వకంగా ఉన్నవి పరిశీలించి సరాసరి రేటును ఎకరా చొప్పున పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా కల్పించారు. భూసేకరణ పారదర్శకంగా ఉంటుందని భూములు కోల్పోయిన రైతులకు నిబంధనల మేరకు పునరావాసం కల్పించి, పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి విచ్చేసిన హాజిపూర్, ఫుల్జాల రైతులు మాట్లాడుతూ అక్కడ కాల్వ అవసరం లేదని, ప్రస్తుతం తయారు చేసిన అలైన్మెంట్ ప్రకారం కేవలం 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు వస్తుందన్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం నడివెల్లి మీదుగా చంద్రసాగర్ చెరువును, ఇతర చెరువులను నింపితే 27 వేల ఎకరాలకు భూసేకరణ తక్కువ ఖర్చులతో పూర్తి అవుతుందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాల్వ వెడల్పు సైతం 280 నుంచి 300 అడుగుల వరకు తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని, దానివల్ల రైతులు ఎక్కువ భూమిని కోల్పోతున్నారన్నారు. ఇప్పటికే ఉన్న డిండి కాల్వకు సమాంతరంగా మరో కాల్వ తీయడం వల్ల ఉపయోగం ఉండదని తమ అభిప్రాయం తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కల్వకుర్తి రాజేష్ కుమార్, అచ్చంపేట ఆర్డీవో పాండు నాయక్, ఇరిగేషన్ ఈఈ సంజీవ్ రావు, రైతులు మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, సత్యమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.