- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వస్తున్న కృష్ణ జలాలు
దిశ,అచ్చంపేట : ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో నిండడంతో దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. తద్వారా జూరాల ప్రాజెక్టు 46 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా 1 లక్ష 69 వేల 602 క్యూసెక్కులు అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24.202వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం1లక్ష 93, 808 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా శ్రీశైలం ప్రాజెక్టుకు 1.70 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా 215.87 టీఎంసీల సామర్థ్యం నీటి నిలువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో ఆదివారం మధ్యాహ్నం నాటికి 853 .20 అడుగులు చేరుకోగా 87.2476టీఎంసీల సామర్థ్యం చేరుకుంది. తెలంగాణ లెఫ్ట్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు విద్యుత్ ఉత్పత్తి అనంతరం 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.