- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ న్యూస్.. బీజేపీ గూటికి బిత్తిరి సత్తి..! ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ..!
దిశ బ్యూరో, మహబూబ్ నగర్/జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ప్రముఖ కమెడియన్ ఆర్టిస్ట్, న్యూస్ రీడర్ బిత్తిరి సత్తి(కావలి రవి కుమార్) సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు, బిత్తిరి సత్తి సామాజిక వర్గం అయిన ముదిరాజ్ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఆయన ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ముదిరాజ్ మహాసభలో బిత్తిరి సత్తి అధికార పార్టీ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం పట్ల ఘాటుగా వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలోనే నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బిత్తిరి సత్తిని జడ్చర్ల నుండి పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ నుండి అవకాశం లభిస్తే పోటీ చేయడానికి బిత్తిరి సత్తి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయమై బిత్తిరి సత్తిని సంప్రదించగా.. జడ్చర్లకు సంబంధించిన పలువురు మిత్రులు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, పోటీ చేసే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్లుగా వెల్లడించారు.