- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > మనిషిలాగే తల, కాళ్లు, నోరు.. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వింత కీటకం
మనిషిలాగే తల, కాళ్లు, నోరు.. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వింత కీటకం

X
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ప్రకృతిలో.. ఎన్నో వింతలు విశేషాలు.. వాటిలో కొన్ని సహజత్వానికి భిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇటువంటి వింతే గద్వాల మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామంలో వెలుగు చూసింది. హలీం పాషా అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాన్ని తలపింపజేసేలా ఉన్న కీటకాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఆ కీటకానికి మనిషికి ఉన్నట్లుగా ముక్కు, నోరు, తల భాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని కొంతమంది ఫోన్లలో బంధించి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Next Story