- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబులకు బిగ్ షాక్.. పండుగ పూట సుక్క దొరకడం కష్టమేనా?
దిశ, తెలంగాణ బ్యూరో: దసరా పండుగకు మద్యం కష్టమవుతోంది. లిక్కర్ తయారీ తగ్గిపోతుండటంతో అడిగినంత స్థాయిలో మద్యం సరఫరా చేయడం లేదు. దానికితోడుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. తాగుడు పెరుగుతుండటంతో.. తయారీ సరిపోవడం లేదు. లిక్కర్ తయారీకి వినియోగించే ప్రధానమైన పదార్థం ఎక్సట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ) లక్షల లీటర్లు వస్తున్నా అందుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రానికి ఈఎన్ఏ కొరత ఏర్పడింది. దీంతో మద్యం తయారీ సంస్థలు ఎక్కువ స్థాయిలో ప్రొడక్షన్ చేయలేకపోతున్నాయి. మరింత పెంచేందుకు ప్రభుత్వం బతిమిలాడుతోంది. ప్రస్తుతం లిక్కర్ ఆదాయమే ప్రభుత్వానికి పెద్దదిక్కుగా మారడంతో.. కంపెనీలు చెప్పినట్లుగా వినేందుకు సిద్ధమయ్యాయి. ప్రతి లీటర్‌పై ప్రభుత్వానికి వచ్చే ఫీజును వదులుకునేందుకు కూడా సర్కారు సిద్ధమైంది. ఒక్కో లీటర్‌పై సర్కారు ఫీజు తగ్గినా.. అమ్మకం వ్యాట్‌తో ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది.
2.5 కోట్ల లీటర్లు అత్యవసరం
మద్యం తయారీకి వాడే న్యూట్రల్ ఆల్కహాల్ ప్రతిరోజు సగటున 4 నుంచి 5 లక్షల లీడర్ల వరకు దిగుమతి చేసుకుంటున్నట్లు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. అయితే, ఇటీవల ఇది దాదాపు 7 లక్షల లీటర్ల డిమాండ్‌కు చేరింది. ఫార్మా ఇండస్ట్రీకి ఉపయోగించే ఈఎన్ఏ మినహాయిస్తే.. మద్యం తయారీ కంపెనీలను సగటున ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో కంపెనీలు ప్రొడక్షన్ తక్కువ చేస్తున్నాయి. గత ఏడాదిలో 18.80 కోట్ల లీటర్ల ఈఎన్ఏను వినియోగిస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటికే 10.01 కోట్ల లీటర్ల ఈఎన్ఏను వాడేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దసరా పండుగకు కావాల్సిన మద్యం తయారీ కోసం ఇప్పుడు 2.5 కోట్ల వరకు ఈఎన్ఏ అత్యవసరమైనట్లు అధికారులు చెప్తున్నారు.
ఏం చేద్దాం..?
మద్యం తయారీపై అబ్కారీ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. డిమాండ్‌కు తగిన విధంగా ఉత్పత్తి పెంచేందుకు నానా తంటాలు పడుతోంది. అసలే ముందు కీలకమైన దసరా పండుగ ఉండటంతో తయారీ పెంచాలని భావిస్తున్నారు. డిస్టలరీ అధికారులు సైతం నిత్యం ఇదే పనిలో పడ్డారు. డిస్టలరీల్లో మకాం వేస్తున్నారు. కొన్ని సంస్థలకు ఇతర ప్రాంతాల నుంచి ఈఎన్ఏ దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో గాయత్రి షుగర్స్, రాడికల్ బయోగ్రానిక్స్, ఈంపీ డిస్టలరీ, హరిత బయో ప్రొడక్ట్, నది బయో ప్రొడక్ట్, మధుకాన్ షుగర్స్ అండ్ పవర్ ఇండస్ట్రీ, ఎలైడ్ బ్లెండర్స్ డిస్టలరీ, ఎన్ఎస్ఎల్ క్రిష్ణవేణి షుగర్స్ సంస్థల నుంచి ఈఎన్ఏ తీసుకుంటున్నారు. దీనికి తోడుగా పంజాబ్, చండీగడ్, ఆంధ్రప్రదేశ్, పూణే, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా ఈఎన్ఈ దిగుమతి చేసుకుంటున్నారు. గతేడాది కూడా చివరకు ఈఎన్ఏ సరిపోకపోవడంతో.. 20 శాతం ఇతర ప్రాంతాల నుంచి తీసుకున్నారు.
ప్లీజ్ పెంచండి.. రాయితీ ఇస్తాం
కీలక సమయంలో మద్యం తయారీ తగ్గుతుండటంతో ప్రభుత్వం డిస్టలరీలను బుజ్జగిస్తోంది. అసలే మద్యం అమ్మకాలపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ దసరాకు మద్యం కొరత వస్తే.. ఖజానాపై భారం పడుతోంది. దీంతో తయారీ కంపెనీలకు వరాలు కురిపిస్తోంది. ఈఎన్ ఏ దిగుమతిపై ఇప్పటి వరకు ప్రభుత్వం లీటరు రూ.4 చొప్పున ఫీజును సైతం వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఎంత ఈఎన్ఏ తీసుకున్నా రూపాయి తీసుకోమని, రాయితీ ఇస్తామంటూ సర్కారు ఆఫర్ ఇస్తోంది. అవసరమైతే ఇంకా రాయితీలు కావాలన్నా ఇస్తామంటూ చెప్తోంది. ఎలాగైనా లిక్కర్ తయారీ పెంచి, సర్కారు ఆదాయానికి సాయం చేయాలంటూ డిస్టలరీలను వేడుకుంటోంది.