- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాంగ్రెస్‌ను వీడుతున్నా: మర్రి శశిధర్ రెడ్డి సంచలన ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని.. అది నయం చేయలేని స్థితికి చేరిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని ఆరోపించారు. ఒక హోంగార్డు పార్టీ నుండి పోతే పోయేదేమి లేదని.. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడుతున్నానని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో చెంచాగాళ్లతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తనలాగే కాంగ్రెస్ పార్టీని త్వరలోనే చాలా మంది వీడుతారని బిగ్ బాంబ్ పేల్చారు. పీసీపీ పదవి రేవంత్‌కు ఇవ్వొద్దని తాను కూడా చెప్పానని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మర్రి శశిధర్ రెడ్డి.. నిన్న హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.