- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రూ.15 నుంచి రూ.20కి కేజీ రైస్.. పట్టణాలలో భలే గిరాకీ

దిశ, రేవల్లి: రేషన్ బియ్యానికి పల్లెలు.. పట్టణాలలో భలే గిరాకీ వస్తోంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి తిరిగి ఆయా మిల్లులు.. బడా వ్యాపారవేత్తలకు విక్రయిస్తూ ఉండడం.. వాటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ యథావిధిగా విక్రయాలు చేస్తూ.. పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక మండలం.. ఒక గ్రామం అని కాకుండా దాదాపుగా అన్ని పల్లెలు, పట్టణాలలో ఈ బిజినెస్ బాహాటంగా సాగుతోంది. సేకరించిన బియ్యాన్ని మధ్యవర్తుల వ్యాపారులకు విక్రయించడం ద్వారా.. ప్రత్యేక వాహనాలలో ఉమ్మడి జిల్లా.. తెలంగాణ రాష్ట్రాన్ని దాటి తరలి వెళుతున్నాయి. బియ్యం తరలే సమయంలో.. పోలీసులు పట్టుకుంటే కేసులు.. లేదంటే సులభంగా సరిహద్దులు దాటి వెళుతున్నాయి.
కీ రోల్ పోషిస్తున్న డీలర్లు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుతున్న రేషన్ బియ్యం వ్యాపారం.. మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూ ఉండడంతో.. రేషన్ డీలర్లు తమ దృష్టిని ఆ వ్యాపారం వైపు సారిస్తున్నారు. మధ్యవర్తులకు బియ్యం అమ్మడం ఎందుకు..!? మేమే వాటిని కొనుగోలు చేసి వ్యాపారులకు అమ్ముకుంటే లాభాలు ఉంటాయి అనుకున్నారో ఏమో.. లబ్ధిదారుల నుండి రేషన్ బియ్యాన్ని డీలర్లు నేరుగా కొనుగోలు చేస్తున్నారు. రేషన్ షాపుల వద్దకు రేషన్ కార్డులు ఉన్న వారిని నేరుగా పిలిపించి సంతకాలు చేయించుకొని వారికి కిలో 15 నుంచి 18 రూపాయల చొప్పున చెల్లిస్తూ.. వారు 25 రూపాయలకు పైగా అమ్ముకుంటున్నట్లు సమాచారం.
నామమాత్రంగా తనిఖీలు :
రేషన్ షాపులు.. అక్రమ బియ్యం తరలింపులపై అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో.. రేషన్ డీలర్లు బియ్యం కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ వ్యవహారాలు బహిర్గతంగా జరుగుతున్న అధికారులు తమకు ఏమి పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనితో పల్లెలు పట్టణాలు అన్న తేడాలు లేకుండా బియ్యం రవాణా ప్రక్రియ బాహాటంగా సాగుతోంది. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తుండడంతో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు నిజా నిజాలు పరిశీలించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రం దాటుతున్న పేదల ఆహారం..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సేకరించిన రేషన్ బియ్యం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు తరలి వెళుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లాలోని కృష్ణ చెక్పోస్ట్ వద్ద ఇన్స్పెక్షన్లు జరుగుతున్నప్పటికీని వాహనాలు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయి.