- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ED Notices: ఏం జరుగుతుందో చూద్దాం.. ఈడీ నోటీసులపై కేటీఆర్ షాకింగ్ రియాక్షన్

దిశ, వెబ్‌డెస్క్: పసలేని పనికిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తమపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తోందిన బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుందని ప్రశ్నించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రిని అడిగినా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసిన ఫొటో బయట పెట్టడంతో అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కీలక ఆరోపణలు చేశారు. సస్పెండ్ చేస్తాను.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు దాచి ఉంచారని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
వాళ్ల వద్ద డబ్బులు తీసుకున్నాడని అనుమానం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్ళాలి కానీ.. అవినీతి కేసులు అని పెట్టడం టైమ్ వేస్ట్ పని అని కొట్టిపారేశారు. హైదరాబాద్ పేరు ప్రతిష్ట.. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు తాము చేసిన ప్రయత్నాన్ని రేవంత్ రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా అవకాశమే లేదని అన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఇప్పుడేం మాట్లాడలేనని తెలిపారు. ఈ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే.. కానీ ఈ ఎఫ్ఐఆర్(FIR) హైకోర్టు(HighCourt) కొట్టి వేస్తే ఏం జరుగుతుందో చూడాలని అన్నారు.
ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ(ED) దూకుడుగా వ్యవహరిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road)పైన ఆరోపణ చేస్తున్న ప్రభుత్వం వెంటనే ఔటర్ రింగ్ రోడ్ రిలీజ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు ప్రభుత్వం లీజును ఎందుకు రద్దు చేయట్లేదు ముఖ్యమంత్రి చెప్పాలని అన్నారు. మంత్రి పొంగులేటి ఇంటిపైన జరిగిన ఈడీ దాడులపైన ఎందుకు స్పందించలేదో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని స్టైళ్లలో పార్టీని బలోపేతం చేస్తూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని కీలక ప్రకటన చేశారు.