- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో మేం ఊహించిన ఫలితం రాలేదు, ఈ ఎదురుదెబ్బను గుణపాఠంగా తీసుకుని బీఆర్ఎస్ ఓటమికి కారణాలను విశ్లేషించకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని తెలిపారు. మాకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా నిలదొక్కుకున్నాం.. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడి పోతామన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. మార్పులు చేసుకుని మళ్లీ ముందుకెళ్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నిరాశపడొద్దని.. రాజకీయాల్లో గెలుపు ఓటములు కామన్ అని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టమని.. వాళ్లు కూడా కుదురుకోవాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలామంది స్వల్ప ఓట్లతో తేడాతోనే ఓడిపోయారన్నారు. ప్రజా తీర్పును గౌరవించి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారని తెలిపారు. ఈ ఫలితం తమకు ఆశ్చర్యం కలిగించిదని అన్నారు.