- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
K. A. Paul : కొండా సురేఖకు మతి భ్రమించింది
దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని కుటుంబంపై మహిళా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను విమర్శించబోయి.. సమంత - నాగచైతన్య విడాకుల అంశం మీద సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం అటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దూమరాన్ని రేపుతున్నాయి. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కొండా సురేఖ మరోసారి మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ ఈ గొడవ ఇంకా ముదురుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కొండా సురేఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖకు మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 72 గంటల్లో సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సమంత ఇంటికి వెళ్ళి మరీ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేఏ పాల్ హెచ్చరించారు.
- Tags
- K. A. Paul