ప్రాధాన్యత సంతరించుకున్న ప్రధానితో Komati Reddy భేటీ

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-16 05:07:16.0  )
ప్రాధాన్యత సంతరించుకున్న ప్రధానితో Komati Reddy భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు భేటీ కానున్నారు. కాగా ఈ భేటీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ముందు తెలిపినట్లుగా శుక్రవారం11 గంటలకు పార్లమెంట్‌లో కోమటిరెడ్డి ప్రధానిని కలవాల్సి ఉండగా 12 గంటల 10 నిమిషాలకు అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయినట్లు తెలిసింది. పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీస్‌లో వెంకట్ రెడ్డి మోడీతో భేటీ కానున్నారు. భేటీ అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో నేరుగా మాట్లాడతానని తెలిపడంతో ప్రెస్ మీట్‌పై ఆసక్తి నెలకొంది. పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గ సమస్యల గురించి ప్రధానిని కలుస్తున్నట్లు కోమటిరెడ్డి చెబుతున్నా భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు. సీనియర్లు పార్టీని వీడటం, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, పీసీసీ కమిటీల నియామకంపై చర్చించిన విషయం తెలిసిందే.

Also Read....

ఫౌంహౌజ్ కేసు: సిట్ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

Advertisement

Next Story