ఆలోపే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వస్తడు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
ఆలోపే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వస్తడు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కులగణన(Caste Census) చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) విఫలం అయిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శలు చేశారు. ఆదివారం ఆయన వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఏ ఒక్క బీసీ సంఘం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే కరెక్ట్ అని అనట్లేదని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సపోర్ట్ చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సర్వే పూర్తయి, బీసీ సంఘాలు సమర్దిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం చేపిస్తామని కీలక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కులం గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదని.. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే చేయాలని హితవు పలిశారు.

త్వరలో తెలంగాణ బీజేపీ(Telangana BJP)కి నూతన అధ్యక్షుడు(New President) రాబోతున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీకి నూతన రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడని కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బిజీ షెడ్యూల్ వల్ల రాష్ట్ర అధ్యక్షుడి నియామకం లేట్ అవుతోందని అన్నారు. బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం తమకు లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను పెట్టేందుకు భయపడుతోందని విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత సంబంధం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్(KCR) కుటుంబం దోపిడీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదేబాటలో నడుస్తున్నారని అన్నారు. అందినకాడికి అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. భూములు అమ్మడం, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందని మండిపడ్డారు.

వనరులు సమకూర్చుకునే అంశంలో ప్రణాళిక లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ కూడా లేదు. గుడ్డెద్దు చేనులో పడ్డట్లు కాంగ్రెస్ పరిపాలన ఉంది. ఘాటుగా, ఆవేశంగా మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు భరించరు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు, దొందూ దొందే అని కిషన్ రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed