Kishan Reddy: తెలంగాణ ప్రజలు ఆమెను ఎప్పటికీ మర్చిపోరు

by Gantepaka Srikanth |
Kishan Reddy: తెలంగాణ ప్రజలు ఆమెను ఎప్పటికీ మర్చిపోరు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమంలో సుష్మా స్వరాజ్‌ది కీలక పాత్ర అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. సుష్మా స్వరాజ్ ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన మంచి నాయకురాలు అని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. అనేక సభల్లో ఆమె అనేకసార్లు తెలంగాణ స్వరాష్ట్రం కావాలని ఆకాంక్షించారని అన్నారు.

ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టి నిర్బంధాలు చేసిన సమయంలో తెలంగాణ ప్రజలకు అండగా లోక్‌సభలో గొంతు ఎత్తిందని తెలిపారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. తెలంగాణ బిల్లును లోక్ సభలో పెట్టినప్పుడు విభజన చట్టంపై మాట్లాడారని గుర్తుచేశారు. చట్టం పెట్టి బిల్లును కాంగ్రెస్ వాయిదా వేసి అడ్డుకోవాలని చూశారని అన్నారు. అప్పుడు బిల్లు పాస్ అయ్యేలా సభ్యులు ఓటేసేలా కూడా చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు సుష్మా స్వరాజ్‌ను ఎప్పటికీ మర్చిపోరు అని అన్నారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ పనిచేస్తోందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed