‘మొసలికన్నీరు కాదు.. కళ్లు తెరిచి చూడు..’ రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

by karthikeya |
‘మొసలికన్నీరు కాదు.. కళ్లు తెరిచి చూడు..’ రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ (Congress Party) మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మహిళల భద్రతపై మొసలికన్నీరు కారుస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోజుకో అఘాయిత్యం జరుగుతున్నా, వేధింపుల పర్వాలు కొనసాగుతున్నా కళ్లు మూసుకుని ఎందుుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ (BJP) పాలిత రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన జరగగానే నిద్రలోంచి లేచి మహిళలపై అఘాయిత్యాలు దారుణమంటూ ప్రకటనలు గుప్పించే రాహుల్ గాంధీకి తెలంగాణ (Telangana)లోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌‌ (Jainur)లో ఆదివాసీ మహిళపై జరిగిన అమానవీయ అత్యాచార ఘటన ఎందుకు కనపడడం లేదని ప్రశ్నించారు. అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ (Autodriver) మైనార్టీ కావడం వల్లే మైనారిటీ సంతుష్టీకరణ విధానాలు అవలంబించే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళ భద్రత గురించి గొప్పగా మట్లాడే మీకు బాధిత ఆదివాసీ మహిళ (Tribal Woman)కు న్యాయం చేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదని నిలదీశారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఘటన జరిగినా, తక్షణమే విచారణ జరిపి, నిందితులకు చట్టపరంగా శిక్షపడేలా తమ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాదిరిగా విచారణలో వివక్ష చూపించడం లేదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన (Kolkata Medical Student Rape Case), జైనూర్‌లో జరిగిన ఘటనను కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఇది ప్రజలంతా గమనిస్తున్నారని ఆయనన్నారు.

ఇలాంటి సున్నితమైన అంశాలతో పాటు మహిళలపై జరిగే అత్యాచారాల ఘటనలపై రాజకీయాలకతీతంగా ముక్తకంఠంతో ఖండించాల్సింది పోయి ఇలా సెలక్టివ్‌గా, ఉద్దేశపూర్వకమైన కేసులపై మాత్రమే మాట్లాడడం రాహుల్ గాంధీకి తగదని అన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని మహిళలపై జరుగుతున్న దాడుల ఘటనల పట్ల వివక్ష లేకుండా స్పందించాలని హితవు పలికారు.

కాగా.. తెలంగాణలో గత 3 నెలల్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాల డేటాను కూడా ఆయన విడుదల చేశారు.

ఆ డేటా ప్రకారం..

  • 13-జూన్-24 - పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.
  • 22-జూన్-24 - నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక గిరిజన మహిళను వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, ఆమెను కాల్చి, కొట్టి, ఆమె కళ్లకు, ప్రైవేట్ భాగాలలో కారం పొడి చల్లారు.
  • 21-జూలై-24 - నాగర్‌కర్నూల్ జిల్లా హాజీపూర్‌లో ఇద్దరు మహిళా కూలీలపై షాపు యజమానులు కారులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
  • 24-జూలై-24 - మలక్‌పేట అంధుల పాఠశాలలో 8 ఏళ్ల చూపులేని బాలికపై దాడి జరిగింది.
  • 30-జూలై-24 - నిర్మల్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ ప్రయాణీకురాలు కదులుతున్న బస్సులో అత్యాచారానికి గురైంది.
  • 30-జూలై-24 - వనస్థలిపురంలో 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
  • 4-ఆగస్టు-24 - దొంగతనం ఆరోపణతో దళిత మహిళ సునీతను షాద్‌నగర్ పోలీసులు దారుణంగా హింసించారు.
  • 22-ఆగస్టు-24 - నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై INC మద్దతుదారులు దాడి చేశారు
Advertisement

Next Story