- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
JNTU: హైదరాబాద్ జేఎన్టీయూ వీసీగా కిషన్ రెడ్డి.. గవర్నర్ ఉత్తర్వులు
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ జేఎన్‌టీయూ (JNTU) (జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ) వైస్ చాన్స్‌లర్‌గా టీ కిషన్ కుమార్ రెడ్డి (Kishan Reddy) నియామకం అయ్యారు. ఈ మేరకు తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma) ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వీసీగా కిషన్ కుమార్ రెడ్డి.. మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. గత ఏడాది మే 21న ఖాళీ అయిన యూనివర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా సాంకేతిక కారణాల వల్ల నియామక ప్రక్రియ రెండు సార్లు వాయిదా పడింది. తాజాగా సర్కార్ ఉత్తర్వులు ఇవ్వడంతో.. ఎట్టకేలకు హైదరాబాద్ జేఎన్‌టీయూకు పూర్తిస్థాయి వీసీ వచ్చినట్లైంది. ప్రస్తుతం జేఎన్టీయూకు ఇన్‌చార్జి వీసీగా ఉన్నత విద్యామండలి చైర్మన్ కొనసాగారు.
Next Story