బాధితులందరినీ ఆదుకుంటాం

by Sridhar Babu |
బాధితులందరినీ ఆదుకుంటాం
X

దిశ, ఎర్రుపాలెం : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులందరినీ ఆదుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండ‌ల పరిధిలోని భ‌వానీపురం గ్రామానికి చెందిన మ‌లిశెట్టి సాంబ‌శివ‌ రావు భారీ వర్షాలకు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న వాగులో కొట్టుకుపోయిన ఘ‌ట‌న‌లో మృతి చెందిన విషయం తెలుసుకొని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇవ్వటమే కాకుండా ప్ర‌భుత్వం తరుపున ఎక్స్​గ్రేషియా ఐదు ల‌క్ష‌ల రూపాయల చెక్కును స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రతాప్ రెడ్డి, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, సేలం వెంకటరామిరెడ్డి, బండారు నరసింహారావు, శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి, లక్ష్మణ రావు, రాజీవ్ గాంధీ, రామారావు పాల్గొన్నారు.

Advertisement

Next Story