- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
khammam జిల్లా వ్యాప్తంగా అరెస్ట్‌లు.. ఆందోళనలో నాయకులు!
దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొదటి బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దీనికి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి ఏర్పాట్లు చేశారు. నేటి సాయంత్రం సభ జరగనుంది. ఈ సభకు మూడు రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఇదే వేదికపై నుంచి జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి నిరసనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరికొంత మందిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమల్ని అక్రమంగా నిర్భందిస్తున్నారని మండిపడుతున్నారు.
Also Read....
త్వరలో విశాఖలో కేసీఆర్ భారీ బహిరంగ సభ : ఏపీ బీఆర్‌ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్