- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శిథిలావస్థలో ఉన్న జీసీసీ భవనం!

దిశ,అన్నపురెడ్డిపల్లి : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఉన్న జీసీసీ భవనం శిథిలావస్థకు చేరింది.అన్నపురెడ్డిపల్లి జిసిసి భవనం మండలంలోని పెద్ద సంఖ్యలో సుమారు 1400 రేషన్ కార్డులు ఉన్న జీసీసీ భవనం గత 40 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం హయాంలో నిర్మించారు. ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు భవనం చేరింది. భవనం లోపల మట్టితో పాటు బియ్యం కలిసి పోతున్నాయని, తినే బియ్యంలో మట్టి రాళ్ళు వస్తున్నాయని రేషన్ కార్డు దారులు వాపోతున్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రజలతో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదివాసి గిరిజన ప్రజలు రేషన్ బియ్యం కోసం అన్నపురెడ్డిపల్లి జీసీసీ వద్దకు వస్తున్నారు. భవనం అసౌకర్యంగా ఉందని వర్షం కురిసిందంటే రేషన్ షాప్ లో ఉన్న బియ్యం తడిసి ముద్దయి పోయి విపరీతంగా ఎలుకలు చొరబడి బియ్యం బస్తాలకు బొక్కాలు పడి బియ్యం మట్టి కలిసిపోతున్నాయని మట్టి కలిసిన బియ్యం ప్రజలకు పంపిణీ చేస్తున్నారని పలువురు రోదిస్తున్నారు.
రాళ్లతో కూడిన తడిసిన బియ్యం తిని ప్రజలు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని, కడుపు నొప్పి ఇతర ఆనారోగ్యాలు ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. వేసవి కాలంలో ప్రజలు బియ్యం తీసుకునేందుకు వస్తే ఎర్రని ఎండలో క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మహిళలు విపరీతంగా ఉన్న ఎండలో నిలబడి ఆసుపత్రి పాలైన సంఘటనలు అనేక సందర్భాలు ఉన్నాయని, రేషన్ కార్డుదారులకు మంచినీటి సౌకర్యం ఇతర సౌకర్యాలు లేక రేషన్ దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు మండల ప్రజలు వాపోతున్నారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి అసౌకర్యంగా శిధిలావస్థకు చేరిన జీసీసీ పాత భవనాన్ని తొలగించి వెంటనే నూతన భవనం నిర్మించాలని ప్రజలకు సౌకర్యం కారణంగా భవన సదుపాయం ఉండే విధంగా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. సేల్స్ మ్యాన్ బాలు నాయక్ ని దిశ వివరణ త్వరగా గత ప్రభుత్వంలో నివేదికల పంపాము ప్రస్తుతం కూడా పంపిస్తున్నాను అధికారి స్పందించడం లేదు అనడం కొసమెరుపు.