- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు కారంతో భోజనం.. అడిగితే టీసీలు ఇస్తామంటూ బెదిరింపులు
దిశ, ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్లకు, పాఠశాలల విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. విద్యార్థులు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో అప్పుడే చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారని సర్కార్ నమ్మింది. అందులో భాగంగానే వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేసింది. కచ్చితమైన మెనూ పాటిస్తూ నాణ్యమైన భోజనం అందిస్తోంది. ఉదయం టిఫిన్ మొదలు రాత్రి డిన్నర్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి మరీ పకడ్బందీగా అమలు చేస్తోంది. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం సర్కార్ ఇంత కష్టపడుతున్నా కొన్ని పాఠశాలలు మాత్రం వీటిని తుంగలోతొక్కుతున్నాయి. ఇష్టారాజ్యంగా విద్యార్థుల భోజనం ఏర్పాటు చేసి వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నాయి.
ఇటువంటి ఘటనే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌లో వెలుగు చూసింది. అక్కడి విద్యార్థులకు నాణ్యమైన భోజనం కరువైంది. తమకు పెడుతున్న అన్నం, కూరల్లో ఏమాత్రం నాణ్యత ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా గత రెండు రోజులుగా తమకు వెల్లుల్లి కారంతోనే భోజనం పెడుతున్నారని తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే టీసీ ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. రెండు రోజులుగా ఇలాగే పెడుతుండడంతో కొందరు విద్యార్థులు చేసేదేం లేక తింటుంటే. మరికొందరేమో కారంతో అన్నం తినలేక పడేస్తున్నారు. ఇంకొందరు విద్యార్థులు ధైర్యం చేసి ఇదేం భోజనం అంటూ అడుగుతున్నారు. అయినా నిర్వహకులు విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా కారంతోనే భోజనం పెట్టడం గమనార్హం.
ప్రశ్నిస్తే బయటికే
కారంతో అన్నం తినలేక విద్యార్థులు ఇదేం భోజనం అని అడిగినందుకు హాస్టల్ వార్డెన్ టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తానని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇష్టం ఉంటే తినండి.. లేకుంటే లేదంటూ కఠినంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు అంటున్నారు. ఒక్కపూటంటే తినగలం కానీ.. రెండ్రోజుల నుంచి ఇదే పెడుతున్నారంటూ వాపోతున్నారు. ప్రతిరోజూ కూరల్లో కూడా నాణ్యత పాటించడం లేదని, ఎలా వండిపెడితే అలా తినాల్సిన పరిస్థితి ఉదంటూ కొందరు విద్యార్థులు చెప్పడం గమనార్హం. పట్టించుకోవాల్సిన ఉపాధ్యాయులు సైతం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని.. ఉన్నతాధికారులు స్పందించి తమకు మంచి భోజనం పెట్టించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.