- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏది ఏమైనా.. ఆయనతోనే నా పయనం..
దిశ బ్యూరో, ఖమ్మం/జూలూరుపాడు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోనే తన పయనం అని.. వైరా నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని విజయాబాయి అన్నారు. గురువారం రాత్రి పొంగులేటి తన అనుచరులతో వైరా నుంచి సీపీఐ నాయకురాలు విజయాబాయి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా.. శుక్రవారం ఆ పార్టీ నేతలు ఆమెకు సీపీఐతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో 'దిశ ప్రతినిధి' విజయాభాయిని సంప్రదించగా.. శీనన్నతోనే తమ పయనం అంటూ చెప్పుకొచ్చారు. పొంగులేటి తనను వారితో ఉండాలని తన వర్గం తరఫున వైరాలో పోటీచేస్తే బాగుంటుందని కోరారని విజయాబాయి చెప్పారు. తమ పయనం పొంగులేటితోనే అని అన్నారు. ఓ పక్కా తండ్రి సీపీఐలో, కొడుకు బీఆర్ఎస్ లో ఉండి రాజకీయాలు చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానమే గెలుపునకు నాంది అన్నారు. శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు తన పయనం ఉంటుందన్నారు. జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని, ఈ క్రమంలో ప్రజాభిమానం ఉన్న నాయకుడిపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఎన్ని కుట్రలు చేసినా శ్రీనివాసరెడ్డి ఎదుగుదలను ఎవరూ ఆపలేరని.. ప్రజాభిమానం ముందు ఇలాంటివేమీ పనికిరావని అన్నారు.
అయితే సీపీఐ పార్టీ తనపై దుష్ప్రచారం మొదలుపెట్టిందని తనకి పార్టీలో సభ్యత్వం లేదని.. పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి పని చేశానని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అయినా పార్టీలో సరైన గుర్తింపు లేదని.. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చిందన్నారు. పొంగులేటి శీనన్న ఆహ్వానం మేరకు తాను ఖమ్మం వెళ్లి కలిశానని, వైరా బరిలో ఉండాల్సిందిగా సూచించారని ఆమె పేర్కొన్నారు. ప్రజాభిమానం ఉన్న శ్రీనివాసరెడ్డి తనను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వైరా నుంచి పోటీచేస్తే శీనన్న మిగతా టీం ఒప్పుకుంటుందా అన్న ప్రశ్నకు అది ఆయన విషయమన్నారు. కొత్తగూడెం అయినా వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలంతో తమ కుటుంబానికి సంబంధాలున్నాయని చెప్పారు. ఏది ఏమైనా తాము పొంగులేటితోనే ఉంటానని.. ఆయన బాటలొనే నడుస్తామన్నారు.
సీపీఐ ప్రాథమిక సభ్యత్వానికి విజయబాయి రాజీనామా
సీపీఐ పార్టీ సభ్యురాలిగా, జిల్లా కౌన్సిల్ ఆహ్వానితురాలిగా కొనసాగుతున్న వైరా నియోజకవర్గానికి చెందిన శ్రీమతి బానోత్ విజయాబాయి ఆ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ కు శుక్రవారం రాజీనామా లేఖను అందజేశారు. ఇప్పటివరకు పార్టీలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.