- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sitarama project : సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ ఆలోచనతోనే పుట్టింది...
దిశ, ఖమ్మం : సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ ఆలోచనతోనే పుట్టిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కేబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు మంత్రులు గా ఉన్నారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు నిజాయితీగా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు సూచించారు. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు... కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తే ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు మేము చేశామని చెప్పాడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును డిజైన్ చేసే సమయంలో ఇదే ప్రతిపక్ష హోదాలో ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి కోసమే ప్రాజెక్ట్ చేస్తున్నారని చెప్పలేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పేరు పెట్టి దానిని వేలేరుపాడు తరలించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మా ప్రాజెక్టుని డిజైన్ చేసి కరువు ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో మూడు లక్షల ఎకరాలకు డిజైన్ చేస్తే, కేసీఆర్ 6 లక్షల ఎకరాలకు డిజైన్ చేసి ప్రాజెక్టును రూపకల్పన చేశారన్నారు. ఈ ప్రాజెక్టు పై నిజంగా చిత్తశుద్ధి మాకు ఉందా..? మీకు ఉందా...? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మూడు మోటర్లు వచ్చాయా లేవా తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ చెప్పాలన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టే ఆయనకు సీతారామ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నారన్నారు. ఈరోజు హరీష్ రావు మాటలను వర్గీకరించి ప్రజల్లో తప్పు దోమ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇది మానుకోవాలని హితవుపలికారు.
రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వాస్తవాలను బహిరంగ సభలో ప్రజలకు వివరించాలని ఎమ్మెల్సీ తాత మధు డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే మొదటగా సంతోషించేది బీఆర్ఎస్ పార్టీ నేని కానీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిర్మాణం చేయకుండానే ఎలా ప్రారంభిస్తారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలకు వివరించే విధంగా కాంగ్రెస్ మంత్రులు పనిచేయాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ లింగాల కమల్ రాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రూరల్ మండలం నాయకులు బెల్లం వేణు, నాయకులు గుండాల కృష్ణ, మైనార్టీ నాయకులు తాజుద్దీన్, ఉప్పల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.