- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిష్టారం అంబేద్కర్ నగర్ ప్రజల ప్రాణాలు కాపాడండి మహా ప్రభో
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీ ఎదురుగా జేవిఆర్ఓసి పరిధిలోని రైల్వే బొగ్గు లోడింగ్ ఏరియా సీఎస్‌పీ నుంచి వెలుపడే డస్ట్ కాలుష్యాన్ని నివారించాలని సోమవారం కిష్టారం, అంబేద్కర్ నగర్ కాలనీ గ్రామ ప్రజలు రైల్వే ట్రాక్ పై కూర్చుని నిరసన కార్యక్రమం చేపట్టారు. సింగరేణి పి ఓ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సింగరేణి అధికారులకు ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మా ఫిర్యాదులు తీసుకుని వాటిని పక్కన పెడుతున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి, శైలో బంకర్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని నివారించాలని, లేదా అంబేద్కర్ నగర్ కిష్టారం 350 కుటుంబాలకు తగిన పరిహారం తో పాటు, వసతి కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని అంబేద్కర్ కాలనీవాసులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పాలకుర్తి సునీత రాజ్, మారోజు నాగేశ్వరరావు, పాలకుర్తి నాగేశ్వరరావు, బోలా నాగేశ్వరరావు, మారోజు శ్రీనివాసరావు, వాడపల్లి కోటేశ్వరరావు, వాడపల్లి కరుణాకర్, పిల్లి పేరయ్య,నక్క కుమారి, పాలకుర్తి సరోజినీ ,పాలకుర్తి రజిని, వేము చిట్టి పాప, బాగా నిర్మల తదితరులు పాల్గొన్నారు.