- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Sitakka : ఆదివాసీ సమస్యల పై మంత్రికి వినతి..
దిశ, టేకులపల్లి : ఆదివారం హైదరాబాదులోని ప్రజాభావన్ లో ఆదివాసీ సంఘాలతో ఆదివాసీ సమస్యల పైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డా. సీతక్క (అనసూయ) సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాకుల రవి, రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశానికి హాజరై సమ్మక సారలమ్మ జాతర, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, కొమరం భీమ్ వర్ధంతి పండుగలను గుర్తిస్తూ ప్రభుత్వం అధికారిక సెలవులను ప్రకటించాలి. 5వ షెడ్యూల్డు భూభాగంలోని మన్యం ప్రాంతాల్లో అన్ని శాఖలలోని ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలను పదోన్నతులు స్థానిక ఆదివాసులతో భర్తీ చేసేలా జీఓ నెంబర్ 3 కి చట్టబద్ధత కల్పించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో సూపర్ న్యుమరి పోస్టులలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులర్ పోస్టులలో సర్దుబాటు చేయాలి.
సూపర్ న్యుమారి పోస్టులలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా పదోన్నతి కల్పించాలి. గిరిజన సంక్షేమ శాఖలో గ్రెడ్ 2 తెలుగు పండిట్, గ్రేడ్ 2 హిందీ పండిట్, పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేసి పదోన్నతి కల్పించాలి. కన్వర్టట్ ఆశ్రమ పాఠశాలలో రెగ్యులర్ పోస్టులను మంజూరి చేయాలి. మన్ననూర్ ఐటీడిఏ పరిధిలో చెంచుల కోసం మంజూరు చేసిన పోస్టులలో పనిచేస్తున్న చెంచు సీఆర్టీలను రెగులర్ చేయాలి. 2005కి ముందు నుండి ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములను సాగు చేయకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని పోడు భూములకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీఎస్ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ల శ్రీనివాసరావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాకుల రవి, రాష్ట్ర కోశాధికారి ఉండం నాగేందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి కుంజ కృష్ణ, వాసం నాగేశ్వరావు, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్తీ భాస్కర్ రావు పాల్గొన్నారు.