- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ వినీత్
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గురువారం జిల్లా పోలీసు శాఖలో పని చేసే అధికారులు, సిబ్బంది కొరకు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు జిల్లాలోని పోలీసులందరికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డా. వినీత్ జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులలో నిమగ్నమై ఉంటున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వారికోసం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లా పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, న్యూరాలజీ, కంటి చికిత్సలు ఇతర ఆరోగ్య సంబంధిత చికిత్సల కొరకు నిపుణులైన వైద్యులను పిలిపించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. ఇచ్చట వైద్య పరీక్షలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారిని పోలీసు శాఖ తరపున మెరుగైన చికిత్స చేయించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వైద్య బృందానికి, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నూతనంగా నిర్మితమవుతున్న పోలీస్ అతిథి గృహం నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలోనే అన్ని రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి. సాయి మనోహర్, ఏఆర్ డీఎస్పీ విజయ్ బాబు, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపీఎస్, కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ వెంకటేష్, ఇల్లందు డీఎస్పీ రమణ మూర్తి సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.