- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అడిషనల్ కలెక్టర్ సార్... ఇదేం న్యాయం..!

దిశ,వైరా : వైరాలోని జాతీయ ప్రధాన రహదారి, మధిర రోడ్డు లకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపులో మున్సిపాలిటీ అధికారులు ద్వందనీతిని ప్రదర్శిస్తున్నారు. వైరా మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ అయిన అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆదేశాలతో ఈ రెండు రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగిస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే అడిషనల్ కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడంలో మున్సిపాలిటీ అధికారులు పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నారు. రోడ్ల పక్కన నాలుగు చక్రాల తోపుడు బండ్లను పెట్టుకొని చిరు వ్యాపారం చేసే వారిపై మున్సిపాలిటీ అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోడ్డుపై ఉన్న డ్రైనేజీల్ని ఆక్రమించి చేపట్టిన శాశ్వత నిర్మాణాల జోలికి మున్సిపాలిటీ అధికారులు వెళ్ళకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఆక్రమణల తొలగింపులో మున్సిపాలిటీ అధికారుల ధ్వంద నీతిని చూసిన స్థానికులు అడిషనల్ కలెక్టర్ గారు ఇదే న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరాలోని రెండు ప్రదాన రోడ్లకు ఇరువైపులా గత రెండు రోజులుగా మున్సిపాలిటీ అధికారులు ఆక్రమణల తొలగింపును నిర్వహిస్తున్నారు. అయితే డ్రైనేజీలపై శాశ్వతంగా నిర్మించిన మెట్లను, ఇతన నిర్మాణాలను, రోడ్డు స్థలం పై ఏర్పాటు చేసిన జనరేటర్ల జోలికి అధికారులు వెళ్లకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
గత సంవత్సర కాలం క్రితమే వైరాలోని ఎస్బిఐ టౌన్ బ్రాంచ్ భవనం కు సంబంధించిన ఇనుప మెట్లు మున్సిపాలిటీ రోడ్డుపై నిర్మించిన విషయమై దిశ దిన పత్రికలో అనేక వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పట్లో కనీసం మున్సిపాలిటీ అధికారులు కనీసం స్పందించలేదు. అంతేకాకుండా ఆ బ్యాంకు ముందు రోడ్డు డ్రైనేజీ పై జనరేటర్ ను ఏర్పాటు చేశారు. ఇలాంటి నిర్మాణాలు వైరాలోని రెండు రహదారుల పక్కల అనేకం ఉన్నాయి. అయితే వాటి జోలికి వెళ్లకుండా కేవలం చిరు వ్యాపారుల తోపుడు బండ్లను రోడ్ల పక్కన తొలగించారు. అంతేకాకుండా రోడ్డుపైకి వేసిన రేకుల షెడ్లను తొలగిస్తున్నారు. మున్సిపాలిటీ రోడ్లను ఆక్రమించి నిర్మించిన మెట్లను, రోడ్లపై పలు వ్యాపార సంస్థల వారు ఏర్పాటు చేసిన జనరేటర్లు ఇతర సామాగ్రిని కనీసం తొలగించకుండా అధికారులు తమ పక్షపాత ధోరణిని చాటుకుంటున్నారు. ఎస్బిఐ టౌన్ బ్రాంచ్ పైనున్న మూడంతస్తుల పైకి ఎక్కేందుకు అవసరమైన మెట్లను మున్సిపాలిటీ రోడ్డుపై ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు గడుస్తున్నా మున్సిపాలిటీ అధికారులకు నేటి వరకు ఆ నిర్మాణం కనిపించడం లేదు. అంతేకాకుండా ముందుగా అలాంటి నిర్మాణాలు జోలికి వెళ్లకుండా చిరు వ్యాపారులని టార్గెట్ గా చేసుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధాన రోడ్లతోపాటు మున్సిపాలిటీ అంతర్గత రోడ్లపై శాశ్వత నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా అడిషనల్ కలెక్టర్ స్పందించి రోడ్ల కి ఇరువైపులా నిర్మించిన శాశ్వత నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.