- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అటవీ భూముల్లో అక్రమంగా బోర్లు.. ఆయన అండతో అక్రమాలు..
దిశ, కారేపల్లి: చీమలపాడు ప్రాంతాన్ని ప్రత్యేక రాజ్యంగా ప్రకటించుకుని ఆ రాజ్యానికి నేనే రాజును అని, నేను ఏది చెబితే అదే జరగాలని బహిరంగంగానే పేర్కొంటూ ఈ బీఆరెస్ లీడర్ చేసే అక్రమాలు రోజు రోజుకు హద్దు మీరుతున్నాయ్. ఎమ్మెల్యే అండదండలు, అంతకంటే ఎమ్మెల్యే తనయుడు ఆశీస్సులు నిండుగా ఉండటంతో ఈ లీడర్ అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
శనివారం రాత్రి రెండు గంటల పాటు ఫారెస్ట్ అధికారులను నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి వారు చేతులెత్తి వేడుకున్నా వదలకుండా ఈ లీడర్ కొట్టిన తీరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కారేపల్లి మండల ఎంపీపీ భర్త చీమలపాడు సర్పంచ్, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన మాలోత్ కిషోర్ మరి కొందరి తో కలసి ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వీరిపై కారేపల్లి పోలీసులు స్టేషన్‌లో సోమవారం కేసు కూడా నమోదైంది.
అటవీ భూముల్లో 1500 పైగా బోర్లు వేయించి కోట్లు గడించాడు..
కారేపల్లి మండలములోని చీమలపాడు, బాజుమాళ్లయిగూడెం, పాటిమీదిగుంపు, తవిసిబోడు, తదితర ప్రాంతాల్లోని అటవీ భూముల్లో గత ఐదేళ్ల నుంచీ ఈ బీఆరెస్ లీడర్ 1500 పైగా బోర్లను అక్రమంగా వేయించారు. రైతుల నుంచి ఒక్కొక బోరుకు 30 వేల రూపాయలు రైతుల నుంచి వసూలు చేసి కోట్లుగడించాడు.
ఈ లీడర్ దగ్గర డబ్బులు తీసుకుని సపోర్ట్ చేయకపోతే వారిపై దాడిచేయడం లేకపోతే ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తానని బెదిరింపులకు పాల్పడి అధికారులను భయబ్రాంతులకు గురిచేసిన సందర్భాలు ఆ ప్రాంతములో అనేకం.
పోడు పట్టాల పేరుతో వసూళ్లు..
పోడు భూములకు పట్టాల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణులు కూడా ఈ బీఆరేస్ లీడర్ పై ఉన్నాయి. ఏడాది కితం గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి పోడు పట్టాలు పంపిణీ చేసిన వ్యవహారంలో ప్రధాన సూత్రధారి కూడా ఈ నాయకుడే. పట్టాల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న గిరిజనులు డబ్బులు ఇచ్చి కూడా బయటికి చెప్పలేని స్థితిలో ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పట్టాలు రాకుండా అపుచేయిస్తాడనే భయంతో మామూళ్లు ఆప్పగించి పనులు చేయించుకున్నారు.
ఏజన్సీ ఏరియా సర్టిఫికెట్లలో భారీగా దండుకున్నాడు..
కారేపల్లి మండలంలో ఏడాది కితం తహశీల్ధార్ కార్యాలయం నుంచి జారే అయిన ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు వ్యవహారంలో భారీ కుంభకోణం చోటుచేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో కూడా ఈ బీఆరెస్ లీడరే ప్రధాన సూత్రధారి. ఏడాదికితం జారీ చేసిన సర్టిఫికేట్ జారీ ప్రక్రియపై విచారణ జరిపితే బోగస్ ఏజన్సీ సర్టిఫికెట్ల భాగోతం వెలుగులోకి వస్తుంది.
నకిలీ పహనీల కేసులో నింధితుడే..
కారేపల్లి మండలంలో ఐదేళ్ల కితం నకిలీ పహనీల కుంభకోణం జిల్లా వ్యాప్తంగా సంచలనం లేపింది. ధీంట్లో పాత్రధారయిన ఈ లీడర్ పోలీసులు పెట్టిన కేసులో నిందితుడు కూడా. ఆరు నెలల కితం కారేపల్లి వైన్స్ షాపుకు చెందిన ఓ ఆటోని తన గ్రామములో ఆపి మద్యం బాటిళ్లన దౌర్జన్యంగా లాక్కుని ఛీ అనిపిచ్చుకున కేసులో కూడా ఉన్నాడు ఈ నాయకుడు.