కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం: మంత్రి పొంగులేటి

by Mahesh |
కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం: మంత్రి పొంగులేటి
X

దిశ, ఖమ్మం రూరల్: అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్టు ఈ స్కూల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేద పిల్లలకు ఉన్నత విద్య అందుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కొమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలే నియోజకవర్గంలోని మండలం పొన్నెకల్లు గ్రామంలో 25 ఎకరాలు ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రా ఎంపీ రామ్ సహాయం రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ మూజుమిల్లాఖాన్ లతో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ..పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఈ రోజు 31 నియోజకవర్గలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శంకుస్థాపన పనులు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మనదే మొట్ట మొదట శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్య, వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.

గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు డీఎస్సీ ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రబుతానికే దక్కిందన్నారు. గత ప్రభుత్వం స్కూళ్ళు పెట్టిందే తప్ప వసతులు కల్పించడం లో విఫలమైందన్నారు. అంతర్జాతీయ స్టాండర్డ్ తో ఇందిరమ్మ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 125 నుంచి 150 కోట్లతో అద్భుతమైన స్కూళ్ల నిర్మాణం చేయబోతోందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందన్నారు. ప్రభుత్వం వచ్చాక 300 కోట్ల తో అనేక కంపెనీలతో స్కిల్ డవలప్ మెంట్ నైపుణ్యం పెంపొందించే అవకాశం కల్పించిందన్నారు. మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందన్నారు. ప్రయివేటు కు దీటుగా పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఎంపీ రఘు రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ నిర్మించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనుకోవడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అన్నారు. సుమారు 3000 మంది విద్యార్థులకు పైగా ఉండే ఈ పాఠశాలలో సకల హక్కులతో నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిడ్డ శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ బాలసా లక్ష్మీనారాయణ డీఈవో సోమశేఖర్ శర్మ, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ డైల్ హరినాథ్ బాబు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బండి జగదీష్, నవీన్, మద్ది మల్లారెడ్డి, అంబటి సుబ్బారావు, తెల్లపూడి శ్రీను, మాజీ సర్పంచ్ సుదర్శన్, వంగూరు రవి,కిషోర్ నాయక్, సురేష్ నాయక్, హరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story