- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీలో దట్టమైన పొగమంచు...
దిశ, మణుగూరు : రాష్ట్రంలో చలి తీవ్రత వణికిస్తోంది. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాదే చలి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీంతో రికార్డ్ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇకపోతే భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో చలి చంపేస్తుంది. దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఉదయం పొగమంచుతో ఏజెన్సీ గిరిజనులు పలు ఇబ్బందులకు గురవ్వుతున్నారు. చలి తీవ్రతకు గూడెం వాసులు గజగజ వణికిపోతున్నారు. దానికి తోడు గత 10రోజుల నుంచి ఏజెన్సీ ప్రాంతంలో మంచు వర్షం కురుస్తోంది. ఈ మంచు వర్షానికి, చలికి పలువురు అనారోగ్యం బారిన పడి మంచాన పడుతున్నారు. కొన్ని చోట్ల చలిని తట్టుకోలేక చలి మంటలతో వెచ్చదనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఏజెన్సీలో ఉన్న యువత, పసిపిల్లలు, వృద్ధులకు జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరాలు, శ్వాసకోశ సంబందిత వ్యాధులు తలెత్తుతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఇద్దరు దగ్గు, జలుబుతో బాధపడటం గమనార్హం. ఉదయం, సాయంత్రం చలి గాలులకు, మారిన వాతావరణంకు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున, వాతావరణ స్థితిగతులు మారడం వలన ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మాస్క్ ధరించి పనులు చేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.