మోడీకి 10 వేల పోస్ట్‌కార్డులు.. ఉద్యమాన్ని ప్రారంభించిన సీపీఎం

by Disha News Desk |
మోడీకి 10 వేల పోస్ట్‌కార్డులు.. ఉద్యమాన్ని ప్రారంభించిన సీపీఎం
X

దిశ, భద్రాచలం అర్బన్: ప్రధాని మోడీకి పదివేల పోస్టు కార్డులను పంపి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేష్ పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని మోడీకి పది వేల పోస్టు కార్డులను పంపారు. ఈ సందర్భంగా ఎం రేణుక అధ్యక్షతన జరిగిన సభలో ఏజే రమేష్ మాట్లాడుతూ.. ఈ పోస్టుకార్డు ఉద్యమంతో భద్రాచలం పట్టణ సమస్యలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కళ్లు తెరవాలని, ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామ పంచాయితీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని అన్నారు. తద్వారా భద్రాచలానికి మోడీ చేసిన నష్టానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైన్ల పొడిగింపు, రామాలయం దేవస్థానాన్ని రామాయణం సర్కిల్‌లో చేర్చడం, గోదావరి బ్రిడ్జిపై రెండో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం తదితర సమస్యలపై ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని ఏజే రమేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్. కోటేశ్వరరావు, సున్నం గంగా, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, వై. వెంకట రామారావు నాదెళ్ల లీలావతి, పి .సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు ఎం. వి. ప్రసాద్ రావు, యు జ్యోతి, డి సీతాలక్ష్మి ,ఎం. నాగరాజు, మాజీ ఎంపీటీసీ చేగొండి శ్రీనివాస్, అంబాజీ రత్నం, ఎస్ భూపేంద్ర, కోరాడ శ్రీనివాస్, కాకా రమణ వెదుళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story