- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవినీతి ఆరోపణలపై మున్సిపాలిటీ చైర్మన్‌కు కలెక్టర్ మెమో జారీ..
దిశ, వైరా: గత నెల రోజులుగా అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ కు జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ మెమో జారీ చేశారు. గత ఫిబ్రవరి 22వ తేదీన వైరా మున్సిపాలిటీలోని 16 మంది కౌన్సిలర్లు చైర్మన్ సూతకాని జైపాల్ పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ.. జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ కు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ల ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించిన జిల్లా అధికారులు ఆ అవినీతి ఆరోపణలపై చైర్మన్ జైపాల్ వివరణ కోసం మెమో జారీ చేశారు. ఈనెల 20వ తేదీన కలెక్టర్ విపి గౌతమ్ ఈ మెమోను జారీ చేశారు. అయితే ఈ మెమోను సర్వ్ చేసేందుకు చైర్మన్ జైపాల్ అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం జైపాల్ ఇంటి తలుపుకు మెమోను సంబంధిత అధికారులు అంటించి వెళ్లారు. ఈ మెమో సర్వ్ చేసిన రెండు రోజుల్లో స్పష్టమైన వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
సోమవారం గ్రామంలో కౌన్సిల్ తీర్మానం లేకుండా మంచినీటి ట్యాంక్ కూల్చివేత, అనుమతులు లేకుండా చైర్మన్ ఇంటి నిర్మాణం చేపట్టడం, మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు తీసుకుని 16 మంది డ్రైవర్లు, 35 మంది కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోవటం, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మూడు లక్షల రూపాయలు తీసుకుని నియమించటం, మున్సిపాలిటీ వాహనాల డీజిల్‌కు సంబంధించి అవకతవకలకు పాల్పడటంతో పాటు.. ఇతర అంశాలపై వివరణ ఇవ్వాలని చైర్మన్ జైపాల్‌ను మోములో కలెక్టర్ ఆదేశించారు. కౌన్సిలర్లు ఫిర్యాదు చేసిన అన్ని అంశాలపై కలెక్టర్ చైర్మన్ జైపాల్‌ను వివరణ కోరారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే మున్సిపాలిటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.