ముక్కోటి మహోత్సవ ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి : కలెక్టర్ అనుదీప్

by Vinod kumar |   ( Updated:2022-12-12 13:58:35.0  )
ముక్కోటి మహోత్సవ ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి : కలెక్టర్ అనుదీప్
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ముక్కోటి మహోత్సవాలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు అప్పగించిన విధులను అంకితభావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షణ భద్రాచలం ఆర్డీవో, బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ శాఖ చేపట్టాలని చెప్పారు. లాడ్జి, హోటల్ యజమానలనులతో సమావేశం నిర్వహించి ధరల నిర్ణయించాలని సబ్ కలెక్టర్‌కు సూచించారు.

ఆలయ పరిసరాల్లో సీసీటీవీ లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. భద్రాచలం, దుమ్ముగూడెం లోని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. భక్తులు మహోత్సవాలు వీక్షణకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని, హంస వాహనం తనిఖీ చేసి దృవీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈ ఈ ని ఆదేశించారు. హంస వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాలు నాణ్యతను తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఆహార తనిఖీ, తూనికలు కొలత శాఖల అధికారులను ఆదేశించారు.

భద్రాచలం పట్టణాన్ని 15 జోన్లుగాను, పర్ణశాలను 4 జోన్లు గాను విభజించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దుమ్ముగూడెంలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి సెక్టార్‌కు ఏర్పాట్లు పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. భక్తులకు బస్సులు, రైల్వే సమయాలను, అలాగే జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేయు చార్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. నూతన సంవత్సర కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు వాహనాలను పార్కింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

READ MORE

Adibatla Vaishali Kidnap Case Updates.. ఇంకా పోలీసులకు చిక్కని నవీన్ రెడ్డి..?

Advertisement

Next Story