టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో మిన్నంటిన సంబరాలు

by samatah |   ( Updated:2022-03-09 10:24:24.0  )
టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో మిన్నంటిన సంబరాలు
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన సందర్బంగా టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణచైతన్య ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఖమ్మం తెలంగాణ భవన్‌లో యువత పెద్ద ఎత్తున తరలివచ్చి బాణసంచా కాల్చారు. అనంతరం స్వీట్లు పంచుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలు, పులాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధు హాజరై, యువతకు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, రెండో దఫాగా 91,142 ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయమని అన్నారు.

టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన ప్రకటన యావత్ తెలంగాణ నిరుద్యోగ యువకులకు సంతోషకరమైన వార్త అని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా నియమించిందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,కమర్తపు మురళి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్లు షేక్ బాజీ బాబా బోజెడ్ల దిలీప్ కుమార్, టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు దేవభక్తిని కిషోర్, మాటేటి కిరణ్, బలుసు మురళీకృష్ణ, కొమ్ము విజేత, రడం సురేష్, లింగ పోయిన సతీష్, దరిపల్లి వీరబాబు, టీఆర్ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed