- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్మపేటలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు..
దిశ, దమ్మపేట : అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు పేరును కేసీఆర్ ప్రకటించడంతో దమ్మపేటలో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, మిఠాయిల పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మెచ్చా నాగేశ్వరరావు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, నాయకుల దారా యుగంధర్, చిన్నశెట్టి సత్యనారాయణ, జిన్నా, జంగాల సర్వేశ్వరరావు, కౌలూరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఇంటికి క్యూ కట్టిన నాయకులు..
బీఆర్ఎస్ పార్టీ దళపతి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో, అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు స్వగ్రామమైన తాటి సుబ్బన్న గూడెం గ్రామంలో తన ఇంటికి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు క్యూ కట్టారు. దీంతో ఆయన ఇంటి వద్ద కోలాహలంగా మారింది. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు శాలువాలు కప్పి మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.