ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా అంబటి ఈశ్వర్

by Disha Web Desk 15 |
ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా అంబటి ఈశ్వర్
X

దిశ,ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు అంబటి సుబ్బారావు కుమారుడు ఈశ్వర్ నియమితుడయ్యాడు. మంగళవారం ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ ఆఫీసులో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎడ్లపల్లి సంతోష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంబటి ఈశ్వర్ మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. అందరినీ కలుపుకుపోతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు ఈశ్వర్ ను అభినందించారు.



Next Story

Most Viewed