- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
దిశ, ఖమ్మం సిటీ : ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం గురువారం రెండో రోజు జిల్లాలో పర్యటించింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కేపీ. సింగ్ నేతృత్వంలో మహేష్ కుమార్, శాంతినాథ్ శివప్ప, ఎస్కే. కుష్వాహ, టి. నియాల్ కన్సన్, డా. శ్రీ శశివర్ధన్ రెడ్డి లతో కూడిన కేంద్ర బృందం ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించింది. మొదటి బృందం ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహకల్ప, ఖమ్మం నగరంలోని కాల్వఒడ్డు బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జి, మోతీనగర్ ప్రాంతాల్లో, రెండో బృందం ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం, తల్లంపాడు-తెల్దారుపల్లి, తనగంపాడు, నగరంలోని ప్రకాష్ నగర్ లలో పర్యటించి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.
ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ మున్నేరు ఉధృతిని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు సర్వం కోల్పోయిన కుటుంబాలను కేంద్ర బృందం కలిసి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ ఖనిజాల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అఖిలేష్ అగస్త్య, శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఆర్డీవోలు జి. గణేష్, రాజేందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Central team