Khairatabad Ganesh: ఏజీ ఆఫీస్ దగ్గర నిలిచిపోయిన ఖైరతాబాద్ గణేశుడు.. ఎందుకంటే..?

by Mahesh |
Khairatabad Ganesh: ఏజీ ఆఫీస్ దగ్గర నిలిచిపోయిన ఖైరతాబాద్ గణేశుడు.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో అత్యంత ఎత్తైన వినాయకుడిగా.. ఖైరతాబాద్(Khairatabad) మహా గణపతి విగ్రహం పేరు గాంచింది. దాదాపు 10 రోజుల నుంచి లక్షల సంఖ్యలో భక్తులకు దర్శనమిచ్చిన ఈ సప్తముఖ మహాగణపతి.. ఈ రోజు తెల్లవారుజామున గంగమ్మ ఒడికి బయలు దేరాడు. 700 మంది పోలీసుల భారీ బందోబస్తు.. వేల సంఖ్యలో భక్త జనసందోహం.. నడుము వడి వడిగా మహాగణపతి ట్యాంక్ బండ్ పైపు పయనమయ్యారు. అయితే ఖైరతాబాద్ నుంచి ప్రధాన దారిలో వేగంగా ముందుకు సాగడం తో భక్తులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి (Bhagyanagar Ganesh Utsava Samiti) సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అనంతరం కొద్ది సేపటికి పోలీసులు వారికి నచ్చజెప్పి ముందుకు కదిలించగా.. ఐజీ ఆఫీస్(AG Office) వద్ద ఖైరతాబాద్ (Khairatabad Ganesh) మహాగణపతిని దాదాపు 45 నిమిషాల పాటు నిలిపేశారు. ఈ సమయంలో భక్తుల కోలాటాలు, డీజే సౌండ్‌లతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారిపోయింది. ఇదిలా ఉంటే మహాగణపతి నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy).. సచివాలయం నుంచి నేరుగా కాలినడకన వెళ్లి పరిశీలించారు. కాగా ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి సచివాలయం ప్రాంతానికి చేరుకోగా.. వేల సంఖ్యలో భక్తులు క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed