- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖబడ్దార్ బీఆర్ఎస్ నాయకుల్లారా.. కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ
దిశ, ఏటూరు నాగారం: ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అయిన ఏటురూ నాగారం మండల కేంద్రంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై మావోయిస్టు యాక్షన్ టీం బద్రు, కామ్రేడ్ వెంకటేష్ పేరుపై హెచ్చరిక లేఖను విడుదల చేశారు. ఏటూరునాగారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన చిప్ప అశోక్, కునూరు మహేష్ టౌన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహమ్మద్ ఖాజా పాషాను, పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల సమక్షంలో ప్రజా కోర్టులో శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు.
ఫారెస్ట్ అధికారులు ప్రజలపై కేసులు పెట్టి వారిని ఇబ్బందులు పెడుతున్నారని, పోలీసుల కన్నా ఎక్కువ చేస్తున్నారని, ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు పద్ధతి మార్చుకుంటే మంచిది అని లేఖలో పేర్కొన్నారు. పోలీస్ ఇన్ఫార్మర్లు ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిది అని లేఖలో రాశారు. అడవిలో పోలీసులు కూలింగ్ ఆపకపోతే బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి నుండి జిల్లా స్థాయి నాయకులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. మావోయిస్టుల లేఖ విడుదలతో బీఆర్ఎస్ పార్టీ నాయకులలో అలజడి మొదలైంది.