బ్రేకింగ్: బర్రెలక్క పిటిషన్‌పై తెలంగాణ హై కోర్టు కీలక తీర్పు

by Satheesh |   ( Updated:2023-11-24 10:47:41.0  )
బ్రేకింగ్: బర్రెలక్క పిటిషన్‌పై తెలంగాణ హై కోర్టు కీలక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్‌ శిరీషకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. స్వతంత్ర అభ్యర్థి శిరీషకు భద్రతా కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా, ఇటీవల అసెంబ్లీ ప్రచారంలో భాగంగా శిరీష ప్రచారం నిర్వహిస్తుండగా.. కొందరు శిరీషతో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ బర్రెలక్క పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తన విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదంటూ బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. శిరీషకు ఒక గన్ మెన్‌తో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు భద్రతను కొనసాగించాలని పేర్కొంది.

శిరీష పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రతా ఇస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల భద్రత ఎన్నికల కమిషన్‌దేనని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, కొల్లాపూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న బర్రెలక్క తనదైన ప్రచారంతో రోజు రోజుకు మరింత బలపడుతోంది. నిరుద్యోగుల గొంతుకనవుతానంటూ ఎన్నికల రేసులోకి దిగిన బర్రెలక్కకు సోషల్ మీడియాతో పాటు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.

Advertisement

Next Story