- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఎమ్మెల్యే లాస్య మృతికి కారణం అదే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికను గాంధీ ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఈ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే లాస్య సీటు బెల్ట్ పెట్టుకోలేదని.. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యి మృతిచెందారని పేర్కొన్నారు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె స్పాట్‌లోనే చనిపోయారని తెలిపారు. లాస్య 6 దంతాలు ఊడిపోయాయని.. తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయని వెల్లడించారు. లెఫ్ట్ లెగ్ పూర్తిగా విరిగిపోయిందని పేర్కొన్నారు. ప్రమాద ధాటికి ఆమె శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు.
కాగా, శుక్రవారం తెల్లవారుజూమున హైదరాబాద్ శివారు పటాన్ చెరు సమీపంలోని ఓఆర్ఆర్‌పై ఎమ్మెల్యే లాస్యనందిత ప్రమాదానికి గురి అయ్యారు. ఆమె ప్రయాణిస్తోన్న కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఎమ్మెల్యే లాస్య అక్కడిక్కకడే మృతి చెందారు. ఆమె డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని లాస్య మృతిదేహాన్ని పటాన్ చెరు అమేధా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడి నుండి నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో లాస్య డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తి కాగా.. భౌతికాయాన్ని సందర్శనార్థం కార్ఖానాలోని ఆమె నివాసానికి తరలించారు.