- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మారనున్న ‘బతుకమ్మ బహుమతి’.. చీరలకు బదులుగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల అందించేది. కానీ, వాటిలో నాణ్యత లేదని, దీంతో అటు మహిళలకు, ఇటు నేతన్నలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం చీరలు పంపిణీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చింది. అందుకు బదులుగా ఏం ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏదైనా గిఫ్ట్ ఇద్దామా? ఒకవేళ ఇస్తే అది వస్తు రూపంలో ఉండాలా? లేక నగదు రూపంలో ఇవ్వాలా? అనే విషయంపై సమాలోచన చేస్తున్నది. ఎవరికి ఇవ్వాలి? అందుకు అర్హతలు ఏంటి? అని విషయంపైనా కసరత్తు చేస్తున్నట్టు టాక్.
ప్రతి ఏటా రూ.370 కోట్లు
గత ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం ప్రతి ఏటా దాదాపు రూ.370 కోట్లు కేటాయించేది. అందులో సగం నిధులు దళారుల చేతిలోకి వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే చీరల నాణ్యతపై మహిళలు రొడ్డెక్కి ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలూ ఉన్నాయి. ప్రభుత్వం ఖర్చు చేసిన పైసలు తమకు ఇస్తే పండుగ ఖర్చులకు ఆసరాగా ఉంటుందని ఎక్కువ మంది మహిళలు అభిప్రాయపడ్డారు. నాటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం.. అంతే మొత్తంలో మహిళలకు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని భావిస్తున్నట్టు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. త్వరలో సీఎం వద్ద జరిగే సమీక్షలో దీనిపై ఏదో ఒక డెసిషన్ తీసుకోనునే చాన్స్ ఉన్నదని వివరించారు.
ఇతర రాష్ట్రాల అమలవుతున్న స్కీమ్స్‌పై ఆరా
వివిధ రాష్ట్రాల్లో ఆయా పండుగల సమయాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రజలకు ఎమైనా బహుమతులు ఇస్తున్నాయా? లేక వస్తువులు అందిస్తున్నాయా? నగదును అందజేస్తున్నాయా? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడి ప్రజలకు ఉచితంగా చక్కెర, ఆయిల్, బెల్లం, నెయ్యి, శనిగలు, కందిపప్పు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా అదే తరహాలో వస్తువులు ఇస్తే ఎలా ఉంటుంది? అనే డిస్కషన్ సైతం జరుగుతున్నట్టు తెలిసింది. ఇలాంటి వాటిలో అక్రమాలు జరిగే చాన్స్ ఉంటుందనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెల్ల రేషన్ కార్డు హోల్టర్లకు రూ.200 లేదా రూ.250 నగదును చేతికి ఇవ్వడమో, లేకపోతే నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో వేయడమో చేస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.