LRS దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

by GSrikanth |   ( Updated:2024-02-26 10:07:17.0  )
LRS దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయి. వాటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. లే ఔట్‌ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారితో పాటు కొత్తగా అప్లై చేసుకునేవారికీ మార్చి 31 వరకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేవాదాయ, వక్ఫ్ భూముల విషయంలో రెగ్యులరైజేషన్ సాధ్యం కాదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తేల్చి చెప్పింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల విషయంలోనూ క్రమబద్ధీకరణ కుదరదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed