వయనాడ్ విషాదంపై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
వయనాడ్ విషాదంపై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి వందలాదిమంది మృతి చెందగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు స్పందిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికసాయం చేస్తున్నారు. ఆదివారం ఈ విషాదంపై తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వయనాడ్ విషాదాన్ని జాతియ విపత్తుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థికంగా కేరళ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్యగా వదిలేస్తే జాతి క్షమించదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదని అన్నారు. 350 మందికి పైగా దుర్మరణం పాలైన వయనాడ్ విలయాన్ని కేంద్రం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంలో చూడాలి అని అన్నారు. అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్‌తో కొండ చరియలు విరిగిపడే ఘటనలపై ముందస్తు హెచ్చరికలకు సంబంధించి ఒక మాన్యువల్ రూపొందించాలని అన్నారు.


Advertisement

Next Story

Most Viewed