- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రి పదవి కోసమైతే అక్కడినుంచి పోటీ చేసేవాడిని.. MLA కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పదవిపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి కోసమైతే ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవాడిని అని అన్నారు. అదే నిజమైతే ఏడాదిగా తాను కూడా మంత్రిగా ఉండేవాడిని తెలిపారు. మునుగోడు(Munugode Constituency) ప్రజలతో ఉన్న అనుబంధంతోనే ఇక్కడి నుంచి చేశారని అన్నారు. తనను మునుగోడు ప్రజలు గతం కంటే డబుల్ మెజార్టీతో గెలిపించారని అన్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర పోటీ నెలకొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య(Beerla Ilaiah), నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham), దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్(Balu Naik)లు కూడా ఆశిస్తున్నారు. ఎవరికి వారు కేబినెట్‌లో తమ సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని.. తమను కేబినెట్‌లోకి తీసుకొని న్యాయం చేయాలని అధిష్టానం వద్ద వాపోతున్నారు. ఇప్పటికే వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను కలిసి పైరవీలు కూడా చేస్తున్నారు. స్థానిక ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరి కేబినెట్‌లో చోటు దక్కించుకునే అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.